హైదరాబాద్, వెలుగు : ఉగాది సందర్భంగా పలు ఆఫర్లు ఇస్తున్నట్టు ఎలక్ట్రానిక్స్ రిటెయిల్చెయిన్ బిగ్‌సీ సీఎండీ బాలు చౌదరి చెప్పారు. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలపై ఆఫర్లను ఇస్తున్నామని తెలిపారు. మొబైల్స్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఏసీలపై 7.5శాతం వరకు తక్షణ తగ్గింపు ఇస్తారు. మొబైల్ ప్రొటెక్షన్ కోసం ఏడాది సబ్స్క్రిప్షన్ చెల్లిస్తే మరో ఏడాది ఉచితంగా పొందవచ్చు. ప్రతి ఫోన్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది.
మొబైల్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్, ఏసీలను జీరో ఈఎంఐతో కొనొచ్చు. బ్రాండెడ్ యాక్సెసరీస్‌పై 51శాతం తగ్గింపు ఉంటుంది. ఐఫోన్, శామ్సంగ్, వివో, రియల్మీ, ఎంఐ మొబైల్స్ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ఉంటాయి. 32 ఇంచుల స్మార్ట్ హెచ్డీ టీవీని రూ.10 వేలకే కొనుక్కోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోళ్లపై 4,000 వరకు క్యాష్‌బ్యాక్ ఉంటుంది.