వరంగల్ సిటీ, వెలుగు: ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన లింగాల కేదారి, పుష్పలత దంపతుల కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కును శనివారం అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కేదారి కుటుంబ సభ్యులను పరామర్శించి, చెక్కును అందజేశారు.
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు అండగా నిలిచిన లింగాల కేదారి సేవలను ప్రజా ప్రభుత్వం గుర్తించి ఆయన కుటుంబానికి ఆర్థిక చేయూత అందించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు.
