ఆర్బీఐ పరిధిలోకి కో-ఆపరేటివ్ బ్యాంకులు

ఆర్బీఐ పరిధిలోకి కో-ఆపరేటివ్ బ్యాంకులు

కో-ఆపరేటివ్ బ్యాంకులన్నింటిని ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం ఆర్డినెన్స్ జారీచేసింది. ఈ ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 1482 సహకార బ్యాంకులు మరియు 58 మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులన్ని కలిపి 1540 బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేబినేట్ నిర్ణయించింది. ప్రధాని నివాసంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో కరోనా విజృంభణ, నివారణ చర్యలు, భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై కీలకంగా చర్చించారు.

కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దేశంలో అర్బన్ బ్యాంకుల సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.

For More News..

న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి

రష్యా విక్టరీ డే పరేడ్ లో రాజ్‌నాథ్ సింగ్…