
- బెల్లంపల్లి రీజియన్లోని 4 ఓసీపీ గనుల్లో స్తంభించిన పనులు
కోల్బెల్ట్, వెలుగు: ఎడతెరిపి లేని వర్షంతో మంగళవారం బెల్లంపల్లి రీజియన్లోని సింగరేణి ఓపెన్కాస్ట్గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రెండోషిప్ట్ లో భాగంగా శ్రీరాంపూర్ఏరియాలోని ఎస్సార్పీ, ఇందారం, మందమర్రి ఏరియాలోని కళ్యాణిఖని ఓసీపీ, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరీగూడ ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులు పూర్తిగా ఆగిపోయాయి.
ఓసీపీల్లోని క్వారీలన్నీ బురదమయంగా మారాయి. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉంది. రీజియన్ పరిధిలో రెండు షిప్ట్ ల్లో సుమారు 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగే చాన్స్ ఉంది.