పెద్దపల్లి జిల్లాలో కోకాకోలా పరిశ్రమ

పెద్దపల్లి జిల్లాలో కోకాకోలా పరిశ్రమ
  •      రూ. 700 కోట్లతో ఎస్టిమేషన్​
  •      మంత్రి శ్రీధర్​ బాబు చొరవతో ముందడుగు
  •      మంథని ప్రాంతంలోని గోదావరి ఒడ్డున కంపెనీ..
  •      మెరుగైన రవాణ, సమృద్ధిగా నీరు
  •      సంతృప్తి వ్యక్తం చేసిన కంపనీ ప్రతినిధులు

పెద్దపల్లి, వెలుగు : ప్రముఖ కూల్​డ్రింక్​ కంపెనీ కోకా కోలా పెద్దపల్లి జిల్లాకు రానుంది. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్​ బాబు చొరవతో  మాన్యూఫ్యాక్చరింగ్​ ప్లాంట్​ కోసం ఆ కంపెనీ    జిల్లాలో  రూ. 700 కోట్ల పెట్లుబడి పెట్టనుంది.    మంథని నియోజకవర్గంలోని గోదావరి సమీపంలో  ప్లాంట్​ ఏర్పాటుకు ఆ కంపనీ ప్రతినిధులు ముందుకు వచ్చినట్టు ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. 

 ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దళ్ల శ్రీధర్​ బాబు అట్లాంటాలోని  కోకా కోలా సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని,  పరిశ్రమలు పెట్టాలని కంపెనీని  మంత్రులు ఆహ్వానించారు.  కోకా కోలా విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపినట్టు మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు ప్రకటించారు.

 బేవరేజెస్​ ఏర్పాటుకు అనుకూలంగా  పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతం ఉందని మంత్రి శ్రీధర్​ సంస్థ ప్రతినిధులకు వివరించారు. కంపెనీకి కావాల్సిన నీరు, రవాణ, గోడౌన్స్​ సదుపాయాల కల్పనకు సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కంపనీ ఏర్పాటుతో జిల్లాలో ఉన్న  కొందరు నిరుద్యోగులకనా  ఉపాధి దొరుకుతుంది.  కంపెనీ ఏర్పాటు అవుతుందన్న విషయం తెలుసుకొని జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

గోదావరి తీరాన..

పారిశ్రామికీకరణకు దూరంగా ఉన్న మంథని నియోజకవర్గంలో కోకాకోలా ఇండస్ట్రీ ఏర్పాటు అవుతుందనే విషయం మంథని ప్రాంతంలో పాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మంథని ప్రాంతానికి పరిశ్రమను తీసుకురావడానికి మంత్రి చిత్తశుద్దితో పని చేస్తున్నారని కాంగ్రెస్​ లీడర్లు అంటున్నారు. బేవరేజెస్​కు   అవసరమైన నీరు అందించేందుకు మంథని ప్రాంతంలో అన్నారం, సుందిళ్ల రెండు బ్యారేజీలు ఉన్నాయి .   ఉమ్మడి కరీంనగర్​, ఆదిలాబాద్​, వరంగల్​కు మంథని సెంటర్​ పాయింట్​గా ఉంటుందని, రవాణాకు ఇబ్బందిగా ఉండదని అంటున్నారు.    

మహరాష్ట్ర నుంచి మంచిర్యాల, గోదావరిఖని, ముత్తారం, మంథని, భూపాలపల్లిని కలుపుతూ నేషనల్​ గ్రీన్​ హైవే నిర్మాణం జరుగుతోంది. దీంతో పెద్దపల్లిలో ఎలాంటి పరిశ్రమ పెట్టినా ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సులభంగా రవాణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కంపనీ  కోకాకోలా ప్రతినిధులకు గోదావరి తీర ప్రాంతంలోని గుంజపడుగ, అడవిసోమన్​పల్లికి సంబంధించిన బ్లూప్రింటును వివరించినట్లు తెలిసింది. కోల్​మైన్స్​, ఓసీపీలకు దూరంగా ఉండేలా పరిశ్రమను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు దాదాపు 300 ఎకరాల భూమి  అవసరమని

గోదావరి దగ్గరలోని  అటవీ ప్రాంతంలో ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని కేటాయించనున్నట్లు తెలుస్తుంది. విదేశీ పర్యటన ముగించుకొని మంత్రి శ్రీధర్​బాబు శనివారం హైదరాబాద్​ చేరుకున్నారు. విదేశీ పెట్టుబడులు, పర్యటన వివరాలు సీఎం రేవంత్​రెడ్డకి వివరించిన తర్వాత కోకాకోల కంపనీతో పాటు ఇతర పెట్టుబడులపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ప్రకటన అనంతరం కంపనీ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించడానికి ఒక ఏడాది పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.