
- వైద్యుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
మదనాపూరు, వెలుగుః ఆత్మకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నలుగురు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఒక హెడ్ నర్స్, అన్ని మౌలిక సదుపాయాలు ఉండి నెలలో 2-3 ప్రసవాలు మాత్రమే జరగటం ఏంటని సూపరింటెండెంట్ ను కలెక్టర్ఆదర్శ్సురభి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. డాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆత్మకూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. నెలలో కనీసం 30 ప్రసవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆత్మకూరు జడ్పీ హై స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటర్ ల్యాబ్ ను కలెక్టర్ ప్రారంభించారు. డీఏఓ ఆంజనేయులుగౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా శ్రీనివాసులు, డా. చైతన్య, సి హెచ్.సి వైద్యులు ఉన్నారు.
వెనుకబడిన స్టూడెంట్లకు ప్రత్యేకంగా బోధన
వనపర్తి, వెలుగు: కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గవర్నమెంటు టీచర్లతో కలెక్టర్ ఆదర్శ సురభి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా తరగతులు పెట్టి అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు. డీఈఓ అబ్దుల్ ఘని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.