
మహబూబాబాద్, వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చురకుగా పనిచేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూప్రకృతి విపత్తులు, వరదలు, భూకంపాలు, తుపాన్ వంటి అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో 20 మందితో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందంనేటి నుంచి ఆగస్టు 14 వరకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో అవేర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్లు కె.అనిల్ కుమార్, లెనిన్ వత్సల్‌టొప్పో, మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని కేజీబీవీ, మండల పరిషత్హైస్కూల్ను డీఈవో రవీందర్‌రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, టీచర్లకు పలు సూచనలు చేశారు.