స్టూడెంట్స్​కు కారంపొడితో అన్నం పెడుతున్నారని కలెక్టర్ ఆగ్రహం

స్టూడెంట్స్​కు కారంపొడితో అన్నం పెడుతున్నారని కలెక్టర్ ఆగ్రహం
  •      అధికారులపై సిద్దిపేట కలెక్టర్​ ఆగ్రహం 
  •     హుస్నాబాద్​మోడల్​స్కూల్ సందర్శన 

హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని మోడల్​ స్కూల్​లో స్టూడెంట్స్​కు కారంపొడితో అన్నం పెడుతుంటే ఏం చేస్తున్నారని స్కూల్​ప్రిన్సిపాల్, ఎంఈవో, డీఈవోపై కలెక్టర్​ప్రశాంత్ ​జీవన్ ​పాటిల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిరోజులుగా స్కూల్​లో స్టూడెంట్స్​కు మిడ్డే మీల్స్​కారంపొడితో పెడుతున్నట్టు కలెక్టర్​ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన గురువారం ఈ స్కూల్​కు వచ్చి విద్యార్థులతో మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు.

తమకు అన్నంలో కూరలు పెట్టకుండా కారంపొడి వేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్​దృష్టికి తెచ్చారు. దీంతో అధికారులపై కలెక్టర్​ సీరియస్​ అయ్యారు. మెనూ ప్రకారం భోజనం పెట్టని వంట ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని డీఈవో శ్రీనివాస్​రెడ్డి, ఎంఈవో దేశిరెడ్డి, ప్రిన్సిపాల్​ అన్నపూర్ణను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి వెంటనే మార్చుకోవాలని సూచించారు. 

ఆఫీసులకు స్థలాన్ని చూడాలి

హుస్నాబాద్​లో మెడికల్​కాలేజీ, ఆర్టీఏ ఆఫీసు ఏర్పాటు కోసం స్థలాన్ని చూడాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. గురువారం తహసీల్దార్ రవీందర్​రెడ్డితో మాట్లాడి అనువైన స్థలాల గురించి తెలుసుకున్నారు. హుస్నాబాద్​ చుట్టుపక్కల అనువుగా ఎక్కడుందో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.