- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హెచ్చరించారు. సోమవారం విధుల్లో చేరిన కలెక్టర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీఎస్ రామకృష్ణ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మీటింగ్నిర్వహించి మాట్లాడారు. నిబంధనల ప్రకారం సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
ఇబ్బందులు వస్తే తెలిపేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు గడువులోగా కంప్లీట్ అయ్యేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
హైవే నిర్మాణానికి భూ సేకరణ చేపట్టాలి
హైవే ప్రాజెక్ట్‌కు సంబంధించి భూ సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో హైవే భూ సేకరణ, పనుల పురోగతిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎన్‌హెచ్ 765 డికి సంబంధించి మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు భూ సేకరణ జరిగిందని, రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు భూ సేకరణ త్వరగా కంప్లీట్ చేసి పరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు.
సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో పార్థసారధిరెడ్డి, డీఈలు ప్రవీన్‌కుమార్, నరేశ్‌కుమార్, ఏఈలు వినోద్, మనోహర్పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. గోడౌన్‌తో పాటు, సీసీ కెమెరాలను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, అధికారులు ఉన్నారు.
