స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి

స్కూళ్లు తెరిచేలోపు అన్ని పనులు పూర్తి చేయాలి

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలం న్యూ లింగంపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్​ఆశిష్ ​సంగ్వాన్ సందర్శించారు. విద్యా సంవత్సరం చివరి రోజు కావడంతో స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందించారు. వేసవి సెలవులను నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగిచుకోవాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను తిరిగి స్కూళ్లు తెరిచేలోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం ఇప్పటికే 25 శాతం నిధులు కేటాయించామని గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

 
కొనుగోలు కేంద్రం, రైస్ ​మిల్లులో తనిఖీలు

మండలంలోని న్యూ సాంగ్వి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రాల వద్ద తాగునీరు, టెంటు, ఇతర సౌకర్యాలు కల్పించి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సరిపడా సంచులు, అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. 

స్థానిక రైస్ మిల్ ను సైతం సందర్శించారు. నిరంతరం మిల్లింగ్ జరగాలని, సీఎంఆర్ సరఫరాను వేగవంతం చేయాలని ఆదేశించారు. మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం, మిల్లు నిల్వ సామర్థ్యం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్​ వెంట డీఈఓ రవీందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శంకరయ్య, సెక్టోరియల్ అధికారులు రాజేశ్వర్, ప్రవీణ్ కుమార్, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది, డీఎస్ఓ నందిత, డీసీఓ నర్సయ్య, రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.