- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. భూభారతి, రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లు, సాదాబైనామాలు, సీఎం ప్రజావాణి పెండింగ్ అప్లికేషన్లు, కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్లజారీ, విపత్తుల నిర్వహణ, హై కోర్టులో పెండింగ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణిలో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు. సర్టిపికెట్ల జారీ వేగవంతం కావాలన్నారు. రేషన్ కార్డుల అప్లికేషన్లు, తహసీల్దార్ల లాగిన్‌కు వచ్చే అప్లికేషన్లను ప్రతి రోజు చెక్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక సమస్య రాకుండా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు వీణ, పార్థసారథిరెడ్డి , ట్రైనీ సబ్ కలెక్టర్ రవితేజ పాల్గొన్నారు.
కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలి..
కామారెడ్డిటౌన్ : ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పారదర్శంగా జరగాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి మండలం ఇస్రోజివాడి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. తూకం యంత్రం పనితీరును పరిశీలించారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,23,994 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు, రైతుల అకౌంట్లలో రూ. 145 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్‌తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ విక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్ పాల్గొన్నారు.
కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు
కామారెడ్డి కలెక్టరేట్మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన ఫొటోకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అలాగే, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కూడా కలాం జయంతి వేడుకలు నిర్వహించారు.
తాడ్వాయి మండల కేంద్రంలో..
తాడ్వాయి : మండల కేంద్రంలోని మక్క కొనుగోలు కేంద్రం, కృష్ణాజివాడ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ రైతులను ఆరా తీశారు. పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, సిబ్బంది రోజువారీ కొనుగోళ్లను లోకల్ యాప్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. .
జిల్లాలో 18 మక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో 13 కేంద్రాల్లో ఇప్పటికే కొనుగోలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలిపారు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ విక్టర్, డిప్యూటీ ట్రైన్ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లై అధికారులు, మార్క్ ఫెడ్ డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సాజిత్ అలీ, ఏవో నర్సింలు పాల్గొన్నారు.
