బాలసదనం తనిఖీ చేసిన కలెక్టర్

బాలసదనం తనిఖీ చేసిన కలెక్టర్

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని మంగళవారం కలెక్టర్​ఆశిష్​ సంగ్వాన్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  బాల సదనం ఆవరణను పరిశీలించారు.  భోజనం, వసతుల గురించి పిల్లలతో మాట్లాడారు.  వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పరిసరాలు క్లీన్​గా ఉండేలా చూసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఫ్యాన్లను రిపేర్​ చేయించాలన్నారు.  సీసీ కెమెరాలు నిరంతరం పని చేయాలన్నారు.  

ప్రెష్​పుడ్​ అందించాలని సూచించారు.  కొద్ది రోజులుగా డ్యూటీకి రాని అవుట్​సోర్కింగ్​ఎంప్లాయి హేమలతను డ్యూటీలో నుంచి తొలగించాలని ఆదేశించారు. బాలికలకు కుట్టు శిక్షణ ఇప్పించాలన్నారు. ఆర్డీవో రంగనాథ చారి,  ఐసీడీఎస్​ జిల్లా ఆఫీసర్​ బావయ్య, సీడబ్ల్యూసీ చైర్మన్​ సత్యనారాయణరెడ్డి, డీసీపీవో స్రవంతి, బాలసదనం సూపరింటెండెంట్ సంగమేశ్వరి ఉన్నారు.