అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ హైమావతి

అభివృద్ధి  పనులను స్పీడప్ చేయాలి : కలెక్టర్ హైమావతి

కోహెడ,(హుస్నాబాద్) వెలుగు: అభివృద్ధి పనులను స్పీడప్​ చేయాలని కలెక్టర్​హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్​ఐవోసీ బిల్డింగ్​లో నియోజకవర్గ స్థాయి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్బంగా మండలాల వారిగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. హుస్నాబాద్​ నుంచి కొత్తపల్లి వరకు నిర్మించే 4 లైన్ల రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఆర్అండ్ బీ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్​ చేయాలన్నారు. 

ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేని వారి నుంచి లేఖలు తీసుకొని అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్​ఆఫీసర్లకు, వన మహోత్సవంలో మొక్కలు నాటాలని పారెస్ట్​ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.