అధికారులు బాధ్యతగా పనిచేయాలి : కలెక్టర్ హైమావతి

అధికారులు బాధ్యతగా పనిచేయాలి : కలెక్టర్ హైమావతి

కొమురవెల్లి, వెలుగు: ప్రభుత్వ అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కొమురవెల్లి మండలంలో  క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ముందుగా పశు వైద్యశాలను పరిశీలించి గొర్రెలు, మేకల వ్యాక్సిన్ అందుబాటులో ఉందా అని డాక్టర్లను ప్రశ్నించారు. ఇప్పటి వరకు 2 వేల గొర్రెలకు టీకాలు అందించామని వారు బదులిచ్చారు. అనంతరం పీహెచ్​సీని సందర్శించి మెడికల్ ఆఫీసర్ లీవ్ లో ఉన్నట్లు స్టాఫ్ నర్సు తెలపగా డీఎం హెచ్ఓకి ఫోన్ చేసి మాట్లాడారు. అనుమతి లేకుండా సెలవులు మంజూరు చేయవద్దన్నారు. 

మండల కేంద్రంలోని ప్రైమరీ, జడ్పీ హైస్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. మెనూ ప్రకారం వంటచేయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. 41 ఇండ్లకు శాంక్షన్ కాగా 38 గ్రౌండింగ్ అయ్యాయని ఎంపీడీవో తెలిపారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. సేల్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ రైతులకు భూ విస్తీర్ణం ప్రకారం మాత్రమే ఎరువులు అందజేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ, పంచాయతీ అధికారులు ఉన్నారు.