తప్పుల్లేకుండా దరఖాస్తుల ఎంట్రీ చేయాలి : కలెక్టర్ హనుమంతు జెండగే

తప్పుల్లేకుండా దరఖాస్తుల ఎంట్రీ చేయాలి : కలెక్టర్ హనుమంతు జెండగే
  • కలెక్టర్ హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : ప్రజాపాలన దరఖాస్తులను తప్పుల్లేకుండా అన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. మంగళవారం అడ్డగూడూరు, వలిగొండలో నిర్వహిస్తున్న  అభయహస్తం   దరఖాస్తుల ఆన్‌‌లైన్‌‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు ఏఏ పథకాలకు అప్లై చేసుకున్నారో ఆ వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు.

గడువులోగా కంప్యూటరీకరణ పూర్తి కావాలని, నమోదు అనంతరం దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపరచాలని  ఆదేశించారు.  ఆయన వెంట తహసీల్దార్‌‌‌‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవోలు చంద్రమౌళి, గీతారెడ్డి, ఎంపీవోలు ప్రేమలత, కేదారీశ్వర్ ఉన్నారు.

మాతాశిశు ఆరోగ్యంపై  శ్రద్ధ పెట్టాలి  

మాతాశిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని  కలెక్టర్‌‌‌‌ హనుమంతు  జెండగే వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం అడ్డగూడూరు పీహెచ్‌‌సీని సందర్శించి వైద్య సేవలపై పేషెంట్లను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు, ఓపీలు పెంచాలని డాక్టర్లను ఆదేశించారు.  బీపీ, షుగర్ పేషెంట్లకు ప్రతి నెలా సకాలంలో మందులు అందించాలని సూచించారు.

అంతకు ముందు  స్కూల్‌‌ను సందర్శించి విద్యార్థులతో పాఠాలను చదివించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రమౌళి,  పీహెచ్‌‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎంపీవో ప్రేమలత ఉన్నారు.