కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత : కలెక్టర్ హనుమంతరావు

కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత : కలెక్టర్ హనుమంతరావు
  • కలెక్టర్ ​హనుమంతరావు

యాదాద్రి, వెలుగు : పరిశ్రమల్లో పని చేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్​లో పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాలపై ఆఫీసర్లు, పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పలు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలు, ప్రాణ నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తకుండా జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను చేపట్టాలని సూచించారు. ఫ్యాక్టరీల్లో రియాక్టర్ల పేలుడు ఉపశమన పానెల్, భద్రత వాల్యూలు కచ్చితంగా ఉండాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అనంతరం గుండాల, వలిగొండలోని ఫెర్టిలైజర్​ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నకిలీ, కల్తీ ఎరువులు, పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మోత్కూరు, గుండాలల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కేక్​కట్​చేసి ఫొటోగ్రాఫర్లను ఆయన అభినందించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీపీఆర్​వో అరుంధతి తదితరులు పాల్గొన్నారు.