టీచర్లు చదువు మంచిగా చెబుతున్నారా..?

టీచర్లు చదువు మంచిగా చెబుతున్నారా..?

యాదాద్రి, వెలుగు : టీచర్లు చదువు మంచిగా చెబుతున్నారా..? అంటూ స్టూడెంట్స్​ను కలెక్టర్ హనుమంతరావు ఆరా తీశారు. శుక్రవారం బీబీనగర్​ మండలం కొండమడుగు జడ్పీ హైస్కూల్​ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​తో మాట్లాడారు. టీచర్లు సరిగా స్కూల్​కు వస్తున్నారా.? పాఠాలు మంచిగా చెబుతున్నారా..? అంటూ అడిగారు. 

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్టూడెంట్స్​కు స్వయంగా వడ్డించారు. అనంతరం పల్లె దవాఖానను ఆయన సందర్శించి పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్లు ట్రీట్మెంట్​ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. మరోవైపు భువనగిరిలోని డంపింగ్ యార్డును అడిషనల్ కలెక్టర్​ భాస్కర్​రావు పరిశీలించారు.