ప్రభుత్వ స్కూళ్లలో రుచికరమైన భోజనం పెట్టకపోతే చర్యలు : కలెక్టర్ హనుమంత రావు

 ప్రభుత్వ స్కూళ్లలో రుచికరమైన భోజనం పెట్టకపోతే చర్యలు :  కలెక్టర్ హనుమంత రావు

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బొమ్మలరామారం మండలం మేడిపల్లి  ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ మెయింటెయిన్ చేయడం లేదని విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఆయన.. సంబంధిత ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మూడు రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే తొలగిస్తామన్నారు. అలాగే విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న హెచ్ఎంకు వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. మైలారం పల్లె దవాఖానను విజిట్ చేసి రికార్డులు తనిఖీ చేశారు. మైసిరెడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. దసరా లోగా ఃకంప్లీట్ చేసుకొని గృహప్రవేశాలు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి

యాదాద్రి, వెలుగు: సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అడిషనల్​ కలెక్టర్ భాస్కర్​రావు ఆదేశించారు. మంగళవారం ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్​, హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. స్టూడెంట్స్​కు ఎలాంటి ఇబ్బంది కలిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పలువురు తమ ఫోన్​లో చాటింగ్​ చేస్తూ కనిపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.27 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను డిసెంబర్​ లోగా కంప్లీట్​ చేయాలని సూచించారు. జడ్పీ సీఈవో శోభారాణి  తదితరులు ఉన్నారు.