
- పలు ఆఫీసుల తనిఖీ, ఆఫీసర్లపై ఆగ్రహం
చేర్యాల, వెలుగు: చేర్యాల మండల కేంద్రంలో బుధవారం కలెక్టర్ హైమావతి పర్యటించారు. పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టి అటెండెన్స్రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా ఆఫీసుల్లో నెలకొన్న పరిస్థితిపై నిరసన వ్యక్తం చేస్తూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చేర్యాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసి వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి మెడిసిన్ స్టాక్, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు.
చేస్తూ రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయాలని లబ్ధిదారుకు సూచించారు. జడ్పీ హై స్కూల్‌ను తనిఖీ చేశారు.
పాఠశాలలో విద్యార్థులు లేకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల బంద్‌తో స్టూడెంట్స్‌ను ఇంటికి పంపించామని హెచ్ఎంతెలిపారు. పట్టణంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి ఎరువుల రిజిస్టర్ ను పరిశీలించారు. స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాధికను, ఏవో యోగేశ్వర్ ను ఆదేశించారు. వానకాలం పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. తహసీల్దార్ ఆఫీసును సందర్శించి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ ను పరిశీలించారు. ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ ఉన్నారా అన్నదానిపై ఆరాతీశారు. ఆఫీసులో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్, రికార్డులను తనతో తీసుకెళ్లారు.