హాలియా, వెలుగు: కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అనుముల మండలంలోని రామడుగు, నిగమనూరు మండలంలోని ఊట్కూరు, మారుపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మళ్లీ రెండు, మూడు రోజుల తర్వాత వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వడ్లను త్వరగా ఆరబెట్టుకోవాలని రైతులకు చెప్పారు. సరైన తేమశాతం, నాణ్యత ఉన్న వడ్లనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
కేజీబీవీ తనిఖీ
తిరుమలగిరి సాగర్ కేజీబీవీని కలెక్టర్ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. విద్యార్థులు, టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. రెగ్యులర్ గా పాఠశాలకు హాజరవుతూ సబ్జెక్టులపై ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. పారిశుధ్యం, విద్యార్థినుల ఆరోగ్యం, భోజనం విషయంలో సమస్యలు రాకుండా చూడాలని ప్రిన్సిపాల్ కవితను ఆదేశించారు అనంతరం తొమ్మిదో తరగతి విద్యార్థినులను బయో సైన్స్ తదితర సబ్జెక్టులపై పలు ప్రశ్నలు అడిగారు. బాగా చదువుకోవాలని చెప్పారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్డీవో శేఖర్ రెడ్డి, డీఈవో భిక్షపతి తదితరులున్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
నల్గొండ అర్బన్, వెలుగు: పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండలోని కలెక్టరేట్ లో రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ మండలంలో భూభారతి ఫిర్యాదులను వారానికోసారి సమీక్షించాలని చెప్పారు.
మొంథా తుఫాన్కారణంగా వరద నీరు చేరగా.. కొమ్మేపల్లి ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించిన దేవరకొండ మండల అధికారులను ఆమె అభినందించారు. అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్(లోకల్బాడీస్) నారాయణ అమిత్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
