
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
సుజాతనగర్, వెలుగు : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకువచ్చిందని కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. సోమవారం సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లి, మంగపేటలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. కౌంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి భూ దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో భూ సమస్యల పరిష్కారానికి కోర్టులే ఏకైక మార్గంగా ఉండగా, ఇప్పుడు అధికార యంత్రాంగం రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, ఆర్ఐ వీరభద్రం, సర్వేయర్ వినోద్, రైతులు పాల్గొన్నారు.