రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడొచ్చని కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్​ అన్నారు. జిల్లా రవాణా శాఖ, ట్రాఫిక్​ పోలీసులు, ఇండియన్​ యూత్ సెక్యూర్డ్​ ఆర్గనైజేషన్​ల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్​, బస్టాండ్​ ఏరియాల్లో మంగళవారం బ్లడ్​ గ్రూపుల టెస్టులను నిరన్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ బ్లడ్​ గ్రూపు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. అత్యవసర సమాయాల్లో బ్లడ్​ గ్రూపు తెలిస్తే రక్తదాతలకు సాయం తీసుకోవడం సులువవుతుందని చెప్పారు.

 ఆపద కాలంలో రక్తం దానం చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఆర్టీవో వెంకటరమణ, డీఎస్పీ రెహమాన్​, అధికారులు మనోహర్​, వెంకటపుల్లయ్య, ట్రాఫిక్​ ఎస్సై నరేశ్​ పాల్గొన్నారు.  

కలెక్టర్​ జితేశ్​కు నేషనల్​ జియో స్పేషియల్​ ప్రాక్టీషనర్​ అవార్డు

కలెక్టర్​ జితేశ్​వీ పాటిల్​ జియో స్పేషియల్​ ప్రాక్టీషనర్​ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం కలెక్టర్​కు వివరాలను పంపించారు. బాంబేలో ఈ నెల 17వ తేదీన జరుగనున్న ఓపెన్​ సోర్స్​ జీఐఎస్​ డే ప్రోగ్రాంలో ఇస్రో మాజీ చైర్మన్​ కిరణ్​ కుమార్​ కలెక్టర్​కు  అవార్డు అందజేయనున్నారు. జిల్లాలోని పాల్వంచలోని అనుబోస్​ ఇంజినీరింగ్​ కాలేజీలో మే 6,7 తేదీల్లో నిర్వహించిన ఓపెన్​ సోర్స్​ జీఐఎస్​ కో హార్ట్​ ప్రోగ్రాంలో గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియో స్పేషియల్​ డేటా వినియోగంపై ప్రాక్టీకల్​గా కలెక్టర్​ నేర్పించారు.

 గోదావరి వరదల టైంలో నీటి స్థాయిని బట్టి ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయడం లాంటి వాటిలో జీఐఎస్​ ఎంతో ఉపయగపడనుందని కలెక్టర్​ పేర్కొన్నారు. అవార్డు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జియో స్పేషియల్​ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చేసిన కృషి వల్లనే తనకు అవార్డు వచ్చిందన్నారు.