బెల్లంపల్లిలో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లిలో పత్తి కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి, వెలుగు : ఇయ్యాల్టి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్​దీపక్​అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులను ఆదేశించారు. తాండూరు మండలంలోని రేపల్లెవాడలోని శ్రీరామ, మహేశ్వరి కాట్స్ జిన్నింగ్ మిల్లులను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. 

కపాస్ కిసాన్ యాప్ లో ప్రతి రైతు తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. పత్తి  విక్రయాలకు స్లాట్ బుక్​ చేసుకునే విధంగా రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దళారులు కొన్న చేసిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తాండూరు తహసీల్దార్ జోత్స్న తదితరులు ఉన్నారు.