
జైపూర్ (భీమారం), వెలుగు: స్కూళ్లకు రాని పిల్లలను బడుల్లో చేర్చేందుకు టీచర్లు కృషి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం ఆయన భీమారం మండలం పౌనూర్, శివ్వారం గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్య, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. ప్రతి స్కూల్లో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, వంట గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
స్కూల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలన్నారు. దాంపూర్, గంగిపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనులు స్పీడప్చేయాలన్నారు. డీసీఎంఎస్ ఫార్మర్ సర్వీస్ సెంటర్ను తనిఖీ చేసి ఎరువులు, విత్తనాల స్టాక్ నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. జైపూర్, భీమారం తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి జారీ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు వనజారెడ్డి, సదానందం, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీవో సతీశ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.