
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జిల్లాలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో)ను మరింత అభివృద్ధి చేయడానికి సభ్యుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఎక్కువ బిజినెస్ చేయొచ్చని సూచించారు. గురువారం అక్కన్నపేట మండలంలోని కుందనవాని పల్లిలో ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లడారు.
రైతులు పంట పండించిన తర్వాత మార్కెట్ రేటు, సౌకర్యాలు అందించే వాళ్లు కావాలని అందుకే కృషికల్ప ఫౌండేషన్ వారితో టై అప్ అయ్యామన్నారు. ఎఫ్పీవో, కృషికల్ప ఫౌండేషన్ వారు చేస్తున్న పనిని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు ఉన్న వనరులను ఉపయోగించుకుని మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో కృషకల్ప ఫౌండేషన్ సీఈవో సీఎం పాటిల్, ప్రసిద్ధ ఎఫ్పీవో సంఘం అధ్యక్షుడు స్వామిరెడ్డి, డీఏవో రాధిక, డీహెచ్ వో సువర్ణ, పలు స్టార్ట్ అప్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
గురుకులాల్లో నాణ్యమైన విద్య
సిద్దిపేటరూరల్: గురుకులాల్లో స్టూడెంట్స్కు నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం పోస్టర్ను ఆవిష్కరించారు. మైనారిటీ స్టూడెంట్స్తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను గురుకులాల్లో చేర్పించాలని సూచించారు.