
- కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: భూభారతి చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మంలోని టీటీడీసీ భవనంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్శాఖ ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్ కు ఇస్తున్న సర్వేయర్శిక్షణను మంగళవారం పరిశీలించారు. భూభారతి చట్టం, భూ సమస్యలు, మ్యాప్, నక్షా, భూ హద్దులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం శిక్షణ పొందుతున్నవారికి మెటీరియల్అందజేశారు. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నేడు మహిళా మార్ట్ ప్రారంభం
ఖమ్మం మహిళా మార్ట్ సిద్ధమైందని, బుధవారం మంత్రులు అధికారంగా ప్రారంభిస్తారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం మార్ట్ ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఆర్గానిక్ ఉత్పత్తులు, తినుబండారాలు, బొమ్మలపై పలు సూచనలు చేశారు. మార్ట్ నిర్వహణపై మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించామని తెలిపారు. డీఆర్డీవో సన్యాసయ్య, పీఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, పీఆర్ ఈఈ మహేశ్ బాబు పాల్గొన్నారు.
భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
జిల్లాలోని భవిత కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అడిషనల్కలెక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 20 రోజుల్లో భవిత కేంద్రాల్లో టాయిలెట్లు, వాష్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పెయింటింగ్ వేయించి, కావాల్సిన పరికరాలు సమకూర్చాలని చెప్పారు. రవాణా సౌకర్యం అవసరమైన పిల్లలను గుర్తించి, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో బడి బాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. డీఈవో సత్యనారాయణ, సీఎంవో రాజశేఖర్ తదితరులున్నారు.
ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులను ఎంపిక చేయండి
ఇందిరా మహిళా డెయిరీకి సంబంధించిన కార్యాచరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఇందిరా మహిళా డెయిరీ, రాజీవ్ యువ వికాసం, మహిళా మార్ట్ ప్రారంభోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతి నెలా వెయ్యి గేదెల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 7,722 మంది రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల వివరాలను బ్యాంకులకు పంపగా 5,183 మందికి సమ్మతి లభించినట్లు పేర్కొన్నారు. డీఆర్డీవో సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి అలీమ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, డీఏవో పుల్లయ్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
బాలికలు అప్రమత్తంగా ఉండాలి
బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మంలోని రిక్కా బజార్ హైస్కూల్లో మంగళవారం స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించిన బాలికల రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్ శిక్షణకు హాజరై, మాట్లాడారు. విద్యార్థినుల రక్షణ విషయంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. బాలికలు తమకు తెలియని వ్యక్తులతో మాట్లాడే ముందు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఈవో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.