చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ పమేలా సత్పతి

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : కలెక్టర్ పమేలా సత్పతి
  • కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు గల క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ పమేలా  సత్పతి అన్నారు. శుక్రవారం సిటీలోని రీజనల్ స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌లో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ సింగ్ ఫొటో వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య ఎంత అవసరమో క్రీడలూ అంతే ముఖ్యమన్నారు. స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌లో ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌‌‌‌ దేశాయ్, డీవైఎస్‌‌‌‌వో శ్రీనివాస్ గౌడ్, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌‌‌‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేశ్‌‌‌‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ రావు, కిరణ్​కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సుమంత్ రావు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మహిళల చదువే కుటుంబాన్ని బాగు చేస్తుంది

శంకరపట్నం, వెలుగు: చదువుకు వయసు అడ్డంకి కాదని, మహిళల చదువే కుటుంబాన్ని బాగు చేస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో నిర్వహించిన శుక్రవారం సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు చిన్నారులు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఓపెన్ టెన్త్, ఇంటర్ లో జాయిన్ అయి చదవుకోవాలన్నారు.

కేశవపట్నం పీహెచ్‌‌‌‌సీలో నార్మల్‌‌‌‌ డెలివరీలు చేయిస్తున్న డాక్టర్ శ్రావణ్ కుమార్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌‌‌వో వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌వో చందు, సీడీపీవో శ్రీమతి, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంఈవో లక్ష్మీనారాయణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు