ప్రాథమిక విద్యే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పునాది : కలెక్టర్ పమేలా సత్పతి

ప్రాథమిక విద్యే భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పునాది : కలెక్టర్ పమేలా సత్పతి

కొత్తపల్లి/చొప్పదండి, వెలుగు: భవిష్యత్ భారతానికి ప్రాథమిక విద్యే పునాది అని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి మండలం పద్మనగర్​ పారమిత హెరిటేజ్ స్కూల్​లో గంగాధర మండల ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీచర్లకు నైపుణ్య శిక్షణను శుక్రవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ టీచర్లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను స్కూళ్లలో అమలుచేయాలని, అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. 

అనంతరం ప్రాథమిక స్థాయి శిక్షణ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. అంతకుముందు చొప్పదండి హెల్త్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓపీ విభాగం, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లేబర్​ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్ కర్ర అశోక్​రెడ్డి, ఎంఈవో ప్రభాకర్​రావు, డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో  సాజిదా, మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకీర్తన, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాపారులు రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటించాలి 

కరీంనగర్ టౌన్, వెలుగు: ఫర్టిలైజర్ వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ రోడ్డులోని ఎరువుల దుకాణాలు, గోదాంలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి విత్తనాల నిల్వ, అమ్మకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఎరువులు కొనేందుకు ఆధార్ వెంట తెచ్చుకోవాలని, తప్పనిసరిగా రసీదును భద్రపరుచుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెడికల్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యుత్తమైన వైద్య సేవలు 
అందించాలని సూచించారు.