
- రైల్వే అధికారులతో సమీక్షలో కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: జమ్మికుంట మండలం మడిపల్లిలో నిర్వహించనున్న ఆర్‌వోబీ నిర్మాణానికి సంబంధించి రైల్వే, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు జాయింట్ సర్వే చేసి, పూర్తి వివరాలతో నివేదిక అందించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్‌వోబీ నిర్మాణానికి వ్యవసాయ భూములు కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారని, వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. దీంతోపాటు సమీపంలో చేపట్టనున్న కచ్చారోడ్డు వివరాలను సేకరించారు. సమావేశంలో రైల్వే చీఫ్ ఇంజినీర్(సికింద్రాబాద్) శర్మ, శ్రీవాణి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.