బాధిత మహిళలకు అండగా భరోసా కేంద్రాలు : కలెక్టర్ రాహుల్ రాజ్

బాధిత మహిళలకు అండగా భరోసా కేంద్రాలు : కలెక్టర్  రాహుల్ రాజ్
  • కలెక్టర్  రాహుల్ రాజ్ 

మెదక్, వెలుగు: బాధిత మహిళలకు అండగా భరోసా కేంద్రాలు పనిచేస్తాయని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. లైంగిక దాడికి గురైన బాధితులకు భరోసా సెంటర్స్ రక్షణ కల్పిస్తాయని చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భరోసా, సఖి సెంటర్స్ ను తనిఖీ చేశారు. భరోసా సెంటర్స్ లో లీగల్, మెడికల్, చిన్నారుల, కౌన్సెలింగ్ స్టేట్మెంట్ రికార్డింగ్ చేసే విభాగాలను పరిశీలించారు. సఖి సెంటర్ నిర్వహణ తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సఖి సెంటర్ ద్వారా ఇప్పటివరకు 1,131 కేసులకు వివిధ రకాల న్యాయ సేవలు అందించినట్లు నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం భవిత కేంద్రాలను  డీఈవో రాధా కిషన్ తో కలిసి పరిశీలించారు. ఎఫ్ ఎల్ ఎన్ కార్యాచరణ ప్రణాళిక టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. 

భవిత కేంద్రం రూపు రేఖలు మార్చి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.14 లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్​, కాలేజీలోఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో 2,11,964  మంది విద్యార్థులకు మాత్రలను వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 

కలెక్టర్ కు రాఖీ కట్టిన దివ్యాంగులు 

ప్రజావాణి హాలులో కలెక్టర్ దివ్యాంగురాలితో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ దివ్యాంగురాలు తనకు ఇందిరమ్మ ఇల్లు  మంజూరులో నెలకొన్న సమస్యలను కలెక్టర్ కు  మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన నిబంధనలు అర్హతలు పరిశీలించాలని డీఎల్పీఓను ఆదేశించారు.   

తహసీల్దార్ ​ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్ 

పాపన్నపేట: భూభారతి అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​అధికారులకు సూచించారు. పాపన్నపేట తహసీల్దార్ ఆఫీసును సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం భూభారతి దరఖాస్తుల పరిష్కారం గురించి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా లేదా అనే వివరాలు సేకరించారు. పాపన్నపేటలో నిర్మించే ఇందిరమ్మ మోడల్ హౌస్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సతీశ్, శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు