
మెదక్ టౌన్, వెలుగు: ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ సిద్ధంగా ఉందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పరికరాలను పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి సలహాలు, సూచనలు అందించారు.
విపత్తు సమయంలో అవసరమయ్యే వాహనాలు, పడవలు, కటింగ్ టూల్స్, డీప్ డైవింగ్ సెట్లు, గాలితో నిండిన లైటింగ్ టవర్లు, కమ్యూనికేషన్ పరికరాలు, మెడికల్ కిట్స్ ను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా అగ్నిమాపక అధికారి సురేశ్, అధికారులు ఉన్నారు.