
పాపన్నపేట, వెలుగు: రైతులకు సకాలంలో ఎరువులు అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ రాహుల్రాజ్తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని పొడ్చన్‌పల్లి పీహెచ్సీ, విద్యుత్ సబ్‌స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం లక్ష్మీనగర్ లోని ఫర్టిలైజర్ షాప్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.
లక్ష్మీ నగర్ ఫర్టిలైజర్ షాప్ లో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వలు, అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలను చెక్‌చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. ఎరువుల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రతిరోజు సమయపాలన పాటించి రైతులకు అందించాలని సూచించారు.
మెదక్ టౌన్, వెలుగు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం పేరూరు గ్రామంలో రైతుల పంట పొలాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరా, ఎరువులు, పురుగు మందుల సరఫరా తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.