విద్యార్థుల్లో ప్రతిభా సామర్థ్యాలను వెలికితీయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

విద్యార్థుల్లో ప్రతిభా సామర్థ్యాలను వెలికితీయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నతులుగా తీర్చదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్​ అన్నారు. గురువారం మెదక్ మండలం మంబోజి పల్లిలో మండల పరిషత్ ప్రాథమిక స్కూల్​ను పరిశీలించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత టీచర్లపైన ఉందన్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించి పలు ప్రశ్నలను అడిగి వారి సందేహాలను కలెక్టర్​ నివృత్తి చేశారు. 

పాపన్నపేట: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్​పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందన్నారు. మహిళలు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబరు 2 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. పలు రికార్డులను పరిశీలించారు. వైద్యుడు అన్వర్, ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు.