సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

 మెదక్​టౌన్, వెలుగు: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్​రాజ్ సూచించారు.​ ఈ నెల 29న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్లు మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గురువారం మెదక్​కలెక్టరేట్​లో రీసోర్స్​పర్సన్​యూసుఫ్​అలీ ఆధ్వర్యంలో అధికారులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్​ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ప్రకారం  ప్రతి ప్రభుత్వ ఆఫీసులో ఒక పీఐవో ఉంటారని,  ప్రజల సమాచార అభ్యర్థనలను స్వీకరించి సమాధానం అందజేస్తారని పేర్కొన్నారు. 

సమాచార హక్కు చట్టంపై అధికారులు అవగాహన  కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​నగేశ్, డీఆర్​వో భుజంగరావు, ఏఎస్పీ మహేందర్, సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసుఫ్ అలీ, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్​ రెడ్డి, జయచంద్రారెడ్డి, పౌర సమాచార అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయాలి

వెల్దుర్తి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. వెల్దుర్తి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు, అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలిస్తూ వేగంగా ఇండ్లు నిర్మించుకోవాలని దశల వారీగా బిల్లు లబ్ధిదారుడి అకౌంట్​లో జమవుతుందన్నారు. అనంతరం బీసీ సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలిస్తూ  విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందించాలని సిబ్బందిని ఆదేశించారు.