
టేక్మాల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని, కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం టేక్మాల్ మండలంలో పర్యటించారు. ముందుగా పీహెచ్సీని తనిఖీ చేసి ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్చేశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించి తరగతి గదులు, స్టోర్ రూమ్, డార్మెట్రీ, కిచెన్తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లోని కూరగాయలు, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలన్నారు. సబ్స్టేషన్ తనిఖీ చేసిన కలెక్టర్
పాపన్నపేట: విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాంయం లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పాపన్నపేట మండలం మిన్పూర్ సబ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. అనంతరం విద్యుత్ సరఫరా, నిర్వహణ తీరుపై ఆరా తీశారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాలు, నిర్వహణ ఏర్పాట్లు, భద్రతా చర్యలు మొదలైన వాటిని పరిశీలించారు. సబ్ స్టేషన్ లోని సాంకేతిక పరికరాల పనితీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.