విద్యార్థుల జీవితంలో టీచర్ల పాత్ర కీలకం

విద్యార్థుల జీవితంలో టీచర్ల పాత్ర కీలకం
  • కలెక్టర్​ రాజర్షి షా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్దడంతో టీచర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. సెప్టెంబర్​5న డాక్టర్ ​సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా నిర్వహించే గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగానే గురువారం పట్టణంలోని జడ్పీ మీటింగ్​హాల్​లో నిర్వహించారు. కలెక్టర్​తో పాటు ఎమ్మెల్యే పాయల్​శంకర్, ఐటీడీఏ పీవో, ఇంచార్జ్ డీఈవో ఖుష్బూ గుప్తా, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ట్రైనీ కలెక్టర్ సలోనీ హాజరయ్యారు.

 ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకు పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ టీచర్లకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. కలెక్టర్​మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్​ను తీర్చిదిద్ది దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. కార్యక్రమంలో హెచ్​ఎంలు, టీచర్లు,  విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.