ఎన్నికల నిబంధనలు పాటించాలి : కలెక్టర్ రాజర్షి

 ఎన్నికల నిబంధనలు పాటించాలి :  కలెక్టర్ రాజర్షి
  •  కలెక్టర్ రాజర్షి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఎన్నికల సంఘం నియమ నిబంధనలను అధికారులు తప్పక పాటించాలని ఆదిలాబాద్​ కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఫ్లయింగ్​స్వ్కాడ్​లు, స్టాటిక్​ సర్వేలెన్స్​ టీంలకు ఎస్పీ అఖిల్​ మహాజన్​తో కలిసి శనివారం కలెక్టరేట్​లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు, నగదు, మద్యం, బహుమతుల పంపిణీ వంటి అక్రమ చర్యలను పకడ్బందీగా పర్యవేక్షించాలని ఆదేశిం చారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ శ్యామలాదేవి, జడ్పీ సీఈవో రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్​ సిబ్బంది సృజనాత్మకత అభినందనీయం

-పనికిరాని వ్యర్థాలను అద్భుతాలుగా మార్చిన మున్సిపల్​సిబ్బంది సృజనాత్మకత అభినందనీయమని కలెక్టర్​ కొనియాడారు. శనివారం స్థానిక గాంధీ పార్క్​లో ‘వేస్ట్ టు వండర్’ ప్రదర్శనను కలెక్టర్​ ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్​సలోని పర్యవేక్షణలో వాడిన నీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్ బాటిళ్లు, పాడైపోయిన వాహన చక్రాలు తదితర వ్యర్థాలను వినూత్న శిల్పాలుగా, ఆకర్షణీయ నమూనాలుగా తయారు చేసి పార్క్​లో ఏర్పాటు చేయగా మున్సిపల్​ సిబ్బందిని అభినిందించారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇలాంటి ప్రదర్శనలు ప్రతి పట్టణంలో ఏర్పాటు కావాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.