ఆదిలాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
  • పీస్​ కమిటీ సమావేశాల్లో అధికారులు, పోలీసులు

ఆదిలాబాద్​టౌన్/నిర్మల్/ఖానాపూర్/భైంసా/ కోల్​బెల్ట్, వెలుగు: జిల్లాలో గణేశ్​ఉత్సవాలు, మిలాద్​ఉన్​నబీ వేడుకలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ ​కలెక్టర్ ​రాజర్షి షా, ఎస్పీ అఖిల్​మహాజన్​ సూచించారు. గురువారం కలెక్టర్​లో పీస్​కమిటీ మీటింగ్ ​నిర్వహించారు. వినాయక మండపాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. 

 మండపాల వద్ద తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అడిషనల్​కలెక్టర్ శ్యామలా దేవి, డీఎస్పీ జీవన్​రెడ్డి, సబ్​ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని ఛబ్రా, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, వినాయక మండపాల నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. 

ప్రతిష్ఠాపన, నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మల్​అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. గురువారం ఏఎస్పీ రాజేశ్ మీనాతో కలిసి పట్టణంలోని బుధవారపేట్ నం.1 గణేశ్​ మండపం నుంచి ఓల్డ్ బస్టాండ్, బాగులవాడ చౌక్, గుల్జార్ మార్కెట్, గాంధీ చౌక్ మార్గంగా బంగల్‌పేట్ చెరువు నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. గణేశ్ ఉత్స వాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో శానిటేషన్, లైటింగ్, తాగునీటి సౌకర్యాలు, భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. 

ఆర్డీవో రత్నకల్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఖానాపూర్​లో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యుతో అడిషనల్ ఎస్పీ రాజేశ్ మీనా మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో సక్సెస్​ చేయాలని  కోరారు. సీఐ అజయ్ కుమార్, తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రత్నాకర్ రావు, మున్సిపల్ కమిష నర్ సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సోదరభావంతో వ్యవహరించాలి

రానున్న వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని భైంసా సబ్​కలెక్టర్​అజ్మీర సంకేత్​ కుమార్ పిలుపునిచ్చారు. భైంసా మున్సిపల్ ​ఆఫీస్​లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వేడుకల్లో అన్ని వర్గాలు, మతాల ప్రజలు పరస్పర సహకారం, సోదరభావంతో వ్యవహారించుకోవాలన్నారు. నవరాత్రి వేడుకలకు పోలీసు శాఖ పడక్బందీ బందోబస్తు చర్యలు చేపడుతుందని ఏఎస్పీ అవినాశ్ కుమార్​అన్నారు. 

మున్సిపల్​కమిషనర్​ రాజేశ్ కుమార్, తహసీల్దార్​ ప్రవీణ్​ కుమార్, ఇరువర్గాల మత పెద్దలు, గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మందమర్రి పోలీస్​స్టేషన్​లో గణేశ్ మండపాల నిర్వాహకులు, వివిధ మతపెద్దలతో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్​శాంతికమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సీఐ శశిధర్​ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, అడిషనల్​ఎస్సై శ్రీనివాస్  పాల్గొన్నారు.