కోడ్​ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలి : రవి నాయక్

కోడ్​ ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలి : రవి నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని ఎన్ఫోర్స్ మెంట్ బృందాలు శుక్రవారం ఉదయం 11 గంటల లోగా వారికి కేటాయించిన స్థానాలలో  విధులు ప్రారంభించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి  రవి నాయక్ ఆదేశించారు.  గురువారం తన చాంబర్ నుంచి ఎన్నికల కోసం నియమించిన స్టాటస్టిక్ సర్వే లెన్సు, ఫ్లయింగ్ స్వ్కాడ్ టీం, వీడియో సర్వే లెన్స్, వీడియో , ఎంసీసీ టీంలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.   

ముందుగా రిటర్నింగ్ అధికారులతో ఆయన  మాట్లాడారు.   అకౌంటింగ్ బృందంలోని అందరికీ శిక్షణ ఇవ్వాలని, అకౌంట్  రిజిస్టర్ల నిర్వహణ,  షాడో రిజిస్టర్ నిర్వహణ, అభ్యర్థుల ఖర్చు బుక్ చేయడం, తదితర అంశాలపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని చెప్పారు.  

వీడియో  సర్వే లెన్సు బృందాలతో  ఫ్లైయింగ్ స్క్వాడ్ టీములు ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన జరిగినట్లయితే  రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ప్రతి అంశాన్ని  సునిశితంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు.   కార్యక్రమంలో  మహబూబ్ నగర్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అనిల్ కుమార్, దేవరకద్ర  రిటర్నింగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జడ్చర్ల రిటర్నింగ్ అధికారి,  అదనపు కలెక్టర్ మోహన్ రావు , అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్, రమణారెడ్డి ,  అధికారులు పాల్గొన్నారు.