పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ : ఎస్. వెంకటరావు

పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ : ఎస్. వెంకటరావు

సూర్యాపేట, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్లలో వెబ్ క్యాస్టింగ్ చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు.  బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లపై బీఎస్​ఎన్​ఎల్​,   ఎస్ ఎన్ ఆర్  ఏజెన్సీ లతో  సమావేశం ఏర్పాటు చేశారు.   ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ 1201  పోలింగ్ కేంద్రాల్లో లోపల వెబ్ క్యాస్టింగ్ ,  187 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో  బయట, లోపల భాగంలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   

అన్ని కేంద్రాల్లో వెబ్ కెమెరాల పర్యవేక్షణకు బీఎల్ఓ,  జీపీ  సెక్రటరీలకు విధులు కేటాయించాలని సూచించారు.  ఇప్పటికే అన్ని  క్రిటికల్ కేంద్రాలపై   నిఘా ఉంచామని,  అలాగే సంబంధిత ఏజెన్సీ పోలింగ్ కేంద్రాల్లో పనులు చేపట్టాలని  ఇంటర్నెట్​ నిరంతరం ఉండాలని  సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక , నోడల్ అధికారి డీపీఓ  సురేష్ కుమార్, బీఎస్​ఎన్​ఎల్​ డీఈ రవి ప్రసాద్ పాల్గొన్నారు. 

 రైతుల నుండి ప్రతి గింజను కొనుగోలు చేస్తాం...

రైతుకు వచ్చిన ఓటీపీని కౌలు రైతుకు తెలియజేయాలని ఓటీపీని  ఓపీయంయస్ లో అప్లోడ్ చేయడం ద్వారా కౌలు రైతు ఖాతాలో మూడు రోజులలో డబ్బులు జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు. సూర్యాపేట మండలం బాలేంల ఐ‌కే‌పి కేంద్రాన్ని ఆకస్మికంగా  కలెక్టర్ తనిఖీ చేశారు.  ఇప్పటివరకు జిల్లాలో  1,09 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. అనంతరం బాలేంల వద్ద ఉన్న మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు.