
రాజన్న సిరిసిల్ల, వెలుగు: జిల్లాలో ఇసుక రవాణాను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా బుధవారం తెలిపారు. జిల్లాలోని ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన పత్రాలతో జిల్లా కలెక్టర్ పేరిట రూ.10వేలతో డీడీ తీయాలన్నారు.
ఆ వివరాలు, పత్రాలను కలెక్టరేట్‌లోని సీసెక్షన్ సూపరింటెండెంట్ ఆఫీసులో అందజేయాలని సూచించారు. జిల్లాలో శాండ్ ట్యాక్స్ అమలు చేయనున్నట్లు చెప్పారు. అనుమతి పొందిన ఇసుక రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాలని ఆదేశించారు.