భూ సర్వేలో టెక్నాలజీ వినియోగంతోనే స్పష్టత : కలెక్టర్ సంతోష్

భూ సర్వేలో టెక్నాలజీ వినియోగంతోనే స్పష్టత : కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: లైసెన్స్ డ్​ సర్వేయర్లు ఫీల్డ్ లో టెక్నాలజీని వినియోగించడంతోనే భూ సర్వేపై స్పష్టత వస్తుందని కలెక్టర్  సంతోష్  తెలిపారు. పట్టణంలోని పాత ఎంపీడీవో ఆఫీసులో నిర్వహిస్తున్న లైసెన్స్​డ్  సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.  సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రిజిస్ట్రేషన్, మ్యుటేషన్  తదితర వాటికి తప్పనిసరిగా సర్వే చేసి మ్యాప్  జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్వేయర్ల శిక్షణ తుది దశలో ఉందని, కీలకమైన డిఫరెన్షియల్  జీపీఎస్​ పరికరాలపై  శిక్షణ కొనసాగుతోందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా భూ కొలతలు అత్యంత ఖచ్చితంగా, తక్కువ సమయంలో గుర్తించవచ్చని తెలిపారు. సర్వేలో ఉపయోగించే పరికరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు