బ్లాక్ మార్కెట్ లో యూరియా విక్రయిస్తే చర్యలు : కలెక్టర్ సంతోష్

బ్లాక్ మార్కెట్ లో యూరియా విక్రయిస్తే చర్యలు : కలెక్టర్ సంతోష్
  •  నాగర్ కర్నూల్ కలెక్టర్ సంతోష్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బ్లాక్ మార్కెట్‌లో యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు.  శుక్రవారం కలెక్టరేట్ లో ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డితో కలిసి నియోజకవర్గ స్థాయి మీటింగ్ నిర్వహించారు. యూరియా ఎమ్మార్పీ రేటు కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో 120 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో వంద మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​ వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ  వచ్చే నెల 2న ఓటర్లు తుది జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్​లో మాట్లాడుతూ జాబితా అభ్యంతరాలను ఈనెల 31వరకు తెలియజేయాలన్నారు. జిల్లాలో 6,47,342 ఓటర్లు ఉన్నారని తెలిపారు.