ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్

ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూర్తి చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో ఆయన పర్యటించారు. జీపీ భవన నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 

కండ్లపెల్లి  గ్రామంలోని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కిచెన్ పనులను పూర్తిచేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లో ప్రజా కవి కాళోజి నారాయణ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, ఎంపీడీవో రమాదేవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ రఘువరన్, డీపీవో మదన్ మోహన్, అధికారులు పాల్గొన్నారు.