
జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 29 ఫిర్యాదులను స్వీకరించారు. మెఫ్మా పరిధిలో పనిచేస్తున్న ఆర్పీలకు ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించి, పీఆర్సీ అమలు చేయాలని జగిత్యాల జిల్లా ఆర్పీలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
జిల్లా పోలీస్ ఆఫీస్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎస్పీ అశోక్‌కుమార్ బాధితుల నుంచి 13 అర్జీలు స్వీకరించారు. నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అంతకుముందు సీఐగా ప్రమోషన్ పొందిన దత్తాద్రి ఎస్పీని కలిశారు.
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆఫీసర్లను ఆదేశించారు. ప్రజావాణిలో 154 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో ఎస్పీ మహేశ్ బి.గీతే గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.