
జగిత్యాల టౌన్, వెలుగు: సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సీజనల్ వ్యాధులు, నివారణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా టీబీ పేషెంట్లను గుర్తించి చికిత్స అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
రాయికల్, వెలుగు: ఐదేళ్లలోపు పిల్లలంతా అంగన్వాడీ కేంద్రాల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. గురువారం రాయికల్‌మండలం బోర్నపెల్లి, ఇటిక్యాల, రాయికల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న హెల్త్ సబ్‌సెంటర్లు, స్కూల్ గదులు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. హెల్త్సబ్సెంటర్ నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. రాయికల్ ప్రభుత్వ హాస్పిటల్‌ను తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఆర్ఐ పద్మయ్య ఉన్నారు.