నారాయణపేట కలెక్టరేట్‌లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నారాయణపేట కలెక్టరేట్‌లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నారాయణపేట, వెలుగు: భగీరథ మహర్షి జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్  సిక్తా పట్నాయక్  పాల్గొని భగీరథ మహర్షి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమాజ హితం కోసం ఆనాడు భగీరథుడు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఏదైనా కష్టమైన పనిని పూర్తి చేయాలంటే భగీరథ మహర్షి కృషిని ప్రస్తావించి, ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాలని పెద్దలు చెబుతారని గుర్తు చేశారు. బీసీ అభివృద్ధి శాఖ అధికారి అబ్దుల్  ఖలీల్, డీపీఆర్వో ఎంఏ రశీద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, సగర సంఘం నాయకులు మల్లికార్జున్, నర్వ చెన్నయ్య సాగర్, విజయ్ సాగర్  ఉన్నారు.

ధన్వాడ: మండలంలోని కంసాన్ పల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని జరుపుకున్నారు. భగీరథ మహర్షి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. కె నర్సింలు, నారాయణ, హనుమంతు, శివరాజ్, లక్ష్మయ్య, వెంకటేశ్, రాజు సాగర్, రమేశ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.