స్కూల్స్ రీఓపెన్ నాటికి బుక్స్ సప్లై చేయాలి : నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్

స్కూల్స్ రీఓపెన్ నాటికి బుక్స్ సప్లై చేయాలి : నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్​నగర్​ (నారాయణపేట), వెలుగు: స్కూళ్ల రీ ఓపెన్​ నాటికి సర్కారు బడుల్లో పుస్తకాలు, యూనిఫామ్స్​సప్లై పూర్తికావాలని నారాయణపేట కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ విద్యాశాఖ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌లో ఎడ్యుకేషన్​, డీఆర్డీఏ, పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రగతి పనులపై రివ్యూ మీటింగ్‌‌‌‌ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ సిబ్బందికి శిక్షణ పూర్తయిందా? లేదా అని డీఈవో గోవిందరాజులును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సదరం స్లాట్ల పెండింగ్‌‌‌‌పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.