
మరికల్, వెలుగు: కేజీబీవీల్లో బాలికలకు చదువుతో పాటు కరాటే, కల్చరల్ ప్రోగ్రాంలను తప్పకుండా నిర్వహించాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్వోకు సూచించారు. మంగళవారం మండలంలోని పస్పుల వద్ద ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. స్టూడెంట్లకు సరిపడ మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నాయా లేదా అని ఎస్వోను అడిగి తెలుసుకున్నారు. మెనూ బోర్డులో సూచించిన ప్రకారం క్రమం తప్పకుండా భోజనం అందించాలన్నారు.
కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారా లేదా అని ఎస్వోను ప్రశ్నించగా సాయంత్రం సమయాల్లో చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారు. డీఈవో గోవిందరాజులు, ఏఎంవో విద్యసాగర్, ఎమ్మార్వో రాంకోటి, ఎంపీడీవో కొండన్న, ఎంపీవో పావనితో పాటు ఎస్వో రాజలక్ష్మిలు ఉన్నారు.