ఓటరు జాబితాను రూపొందించాలి : శరత్

ఓటరు జాబితాను రూపొందించాలి : శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు: 2024, జనవరి 1 నాటికి 18  ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఓటరు జాబితా రూపకల్పనపై అధికారులతో సమీక్ష  నిర్వహించారు. ఆయన ​మాట్లాడుతూ... 2024,జనవరి 6న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని, 22 వరకు అభ్యంతరాలు స్వీకరించి  ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితాను వెల్లడిస్తామన్నారు. 

ఓటరు జాబితాలో డబుల్ ఓటర్లు, చనిపోయిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలుంటే తొలగించాలన్నారు. 1500కు మించి ఓటర్లు ఉన్నచోట అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఒక ఇంటిలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా జాబితాలో ఫొటోలు, ఇంటి నంబర్లు, పేర్లు, వయస్సు, పుట్టిన తేదీ లాంటి వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవాలని సూచించారు.  సమావేశంలో అడిషనల్​కలెక్టర్ చంద్ర శేఖర్, డీఆర్వో నగేశ్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఆయా తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.